టీనేజ్‌లో నిద్రలేమి..వృద్ధాప్యంలో అనారోగ్యం!

లాస్‌ ఏంజిలిస్‌: యుక్త వయసులో నిద్రకు దూరమైతే వృద్ధాప్యంలో మానసిక, శారీరక అనారోగ్యాలతో బాధపడాల్సి వస్తుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. చిన్నతనంలో గాఢంగా నిద్రిస్తామని, వయసు పెరుగుతున్నకొద్దీ ఈ స్థితి తగ్గిపోతుందని యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియా పరిశోధకుడు బ్రిస్‌ మాండర్‌ తెలిపారు. గాఢ నిద్రలో మెదడులోని తాత్కాలిక మెమరీ(హిప్పోక్యాంప్‌స)లో నిక్షిప్తమైన జ్ఞాపకాలు శాశ్వత మెమరీ(ప్రిఫ్రాంటల్‌ కార్టెక్స్‌)లోకి మారతాయని అన్నారు. యుక్త వయసులో ఎంత గాఢంగా నిద్రిస్తే ఈ పక్రియ అంత బాగా జరుగుతుందన్నారు.