ఆలోచనలను చదివేయొచ్చు

టోక్యో, ఏప్రిల్‌ 18: మదిలో కదలాడే ఆలోచనల సంగతి చెబితే తప్ప తెలియదనుకోవడం నిన్నటి వరకే.. ఎందుకంటే మీరు చెప్పకపోయిన మీ ఆలోచనలను దాదాపు కచ్చితంగా అంచనా వేసే సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. మెదడు నుంచి వెలువడే తరంగాలను నిశితంగా పరిశీలించడం ద్వారా ఆలోచనలను తెలుసుకోవచ్చని టొయొహషి యూనివర్సిటీ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ ప్రక్రియలో ఎలక్ట్రో ఎన్‌సెఫలోగ్రామ్‌(ఈఈజీ) సాయపడుతుందని అన్నారు. కాగా, ఈ అధునాతన సాంకేతిక పరిజ్ఞానం.. అనారోగ్యంతో మాటపడిపోయిన వారికి ఎంతగానో ఉపయోగపడుతుందని, వారితో మాట్లాడేందుకు ఇది సాయపడుతుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.