నిద్రలేమితో మెదడుకు చేటు

లండన్‌: దీర్ఘకాలంపాటు సరిగ్గా నిద్ర లేకపోతే అది మెదడుకు చేటు చేస్తుందని.. అల్జీమర్స్‌, ఇతర నాడీ సంబంధ వ్యాధులకు దారి తీస్తుందని మార్షె పాలిటెక్నిక్‌ యూనివర్సిటీ(ఇటలీ) పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. నిద్ర లేమి ప్రభావాలపై పరిశోధన చేసేందుకు వారు కొన్ని ఎలుకలను ఎంచుకున్నారు. వాటిని రెండు గ్రూపులుగా చేసి.. ఒక గ్రూపులోని ఎలుకలను వాటికి అవసరమైనంత సేపు నిద్రపోనిచ్చారు. రెండో గ్రూపులోని ఎలుకలను వరుసగా ఐదు రోజులపాటు అసలు నిద్రే పోకుండా చూశారు. నిద్ర పోని ఎలుకల్లో మెదడు నరాల అనుసంధానం దెబ్బతిన్నట్టు వారి పరిశోధనలో తెలిసింది.