కూల్‌డ్రింక్స్‌తో మెదడుకు దెబ్బ?

ఆంధ్ర‌జ్యోతి,03-05-2017: అందరికీ అందుబాటు ధరలతోపాటు రుచి, తియ్యదనం తదితర అంశాలు ఎక్కువగా ఆకర్షిస్తుండడంతో చాలా మంది కూల్‌డ్రింక్స్‌ను తాగకుండా ఉండలేరు. తరచూ కూల్‌డ్రింక్స్‌ తాగేవారిలో ఊబకాయం, చక్కెర వ్యాధి కనిపించే అవకాశాలు ఎక్కువన్న సంగతి గతంలో నిర్వహించిన పరిశోధనల్లో వెల్లడైంది. ఇప్పుడు ఇవి మెదడు మీద కూడా తీవ్రప్రభావాన్ని చూపుతుందన్న విషయం ఇటీవల నిర్వహించిన పరిశోధనల్లో స్పష్టమైంది. కూల్‌డ్రింక్స్‌ తాగే కొంతమంది మీద అధ్యయనం నిర్వహించారు. వీరి మెదడు కుంచించుకుపోవడం, నిర్వీర్యమవడం, జ్ఞాపకశక్తి సన్నగిల్లడవం వంటి లక్షణాలు పరిశోధకులు గుర్తించారు. మామూలు కూల్‌డ్రింకుల కన్నా కూడా డైట్‌ కూల్‌డ్రింక్‌ తీసుకునేవారిలో ఈ ముప్పు మూడు రెట్లు అధికంగా ఉంటుందని వారు చెబుతున్నారు. అందువలన ఎంత దాహమైనా బయట దొరికే కూల్‌డ్రింక్‌ల జోలికి పోకుండా ఇంట్లో తయారు చేసిన జ్యూస్‌లనే ఎక్కువగా తీసుకోవాలని వారు సూచిస్తున్నారు.