మితమే అయినా మద్యంతో ముప్పే

9-6-2017‌: మద్యం.. మితంగా తీసుకున్నా మెదడుకు చేటు తప్పదని ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. జ్ఞాపకశక్తికి సంబంధించిన సమస్యలు ఎదురవుతాయని తెలిపారు. ఈమేరకు 550 మంది ఆరోగ్యవంతులైన స్త్రీ, పురుషులను ఎంపికచేసి తరచుగా వారిని పరీక్షించామని అన్నారు. ఇలా 30 ఏళ్ల పాటు నిర్వహించిన పరిశోధనలో మితంగా తీసుకున్నా మద్యపానంతో అనారోగ్యాలు తప్పవని తేలిందని చెప్పారు. ముఖ్యంగా మద్యపానం ప్రభావం మెదడుపై తీవ్రంగా ఉంటుందని, మోతాదు తగ్గినా కూడా ఈ ప్రభావంలో మార్పులేదని వివరించారు.