బొప్పాయితో మతిమరుపు దూరం?

ఆంధ్రజ్యోతి, 06-06-2017: బొప్పాయితో మతిమరుపు దూరం చేసుకోవచ్చా? అన్న సందేహం అక్కర్లేదు అంటున్నారు పరిశోధకులు. ప్రతిరోజూ ఒక బొప్పాయి పండు తిన్నట్టయితే జ్ఞాపకశక్తి భేషుగ్గా ఉంటుందని, మెదడు పనితీరు కూడా మెరుగుపడుతుందన్న విషయం వీరి అధ్యయనంలో వెల్లడైంది. కొంతమంది మీద వీరు అధ్యయనం నిర్వహించారు. వీరిని రెండు గ్రూపులుగా విభజించి, ఒక గ్రూపు వారికి ప్రతిరోజూ బొప్పాయి పండు ఇచ్చారు. రెండో గ్రూపు వారికి బొప్పాయి పండు ఇవ్వలేదు. కొన్ని రోజుల అనంతరం వీరి మెదడు పనితీరునూ, జ్ఞాపకశక్తిని పరిశీలించారు. ప్రతిరోజూ బొప్పాయి తిన్నవారిలో పై రెండూ మెండుగా ఉండగా, పండు తినని వారిలో జ్ఞాపకశక్తి సన్నగిల్లడాన్ని గమనించారు. ఈ మార్పులకు బొప్పాయి పండే కారణమా అన్న విషయం మీద వీరు ఇంకా పరిశోధనలు నిర్వహిస్తున్నారు.