గాఢ నిద్రతో మెదడు పనితీరు మెరుగవుతుందట!

15-08-2017: మెదడు కొత్త శక్తిని సంతరించుకుని, ప్రభావవంతంగా పనిచేయడానికి గాఢనిద్ర ఎంతో మేలు చేస్తుందని తాజా పరిశోధనలో తేలిం ది. కంటి కదలికలు లేని ‘ఎన్‌ఆర్‌ఈఎమ్‌’ నిద్ర తర్వాత మెదడు పనితీరు అంతకుముందు కంటే ఎంతో మెరుగవుతుందని కాలిఫోర్నియా వర్సిటీకి చెందిన భారత సంతతి శాస్త్రవేత్త కరునేశ్‌ గంగూలీ పరిశోధనలో తేలింది. బ్రెయిన్‌ మెషీన్‌ ఇంటర్‌ఫేజ్‌ (బీఎమ్‌ఐ) ద్వారా గాఢనిద్ర తర్వాత మెదడు పనితీరును విశ్లేషించారు. గాఢనిద్రలో మెదడు, నాడీ కణాలు పూర్తిగా విశ్రాంతి దశలోకి వెళతాయని, నిద్ర లేచే సమయానికి కొత్త శక్తిని సంతరించుకుంటాయని ఆ పరిశోధనలో తేలింది.