టీనేజ్‌లో తాగుడు.. మెదడుకు చేటు

20-7-2017: యువతీ, యువకులారా..! ఒక్క నిమిషం. పార్టీల్లో, పబ్బుల్లో ఆనందంలో విపరీతంగా తాగేస్తున్నారా? టీనేజ్‌లో ఉండగా ఎక్కువగా మద్యం సేవిస్తే మెదడు మొద్దుబారుతుందట. జ్ఞాపకశక్తి, శ్రద్ధాసక్తులు, భాషకు సంబంధించిన మెదడులోని భాగం కుచించుకుపోతుందట. భవిష్యత్తులో మతిమరుపు రుగ్మతలు ఎక్కువయ్యే అవకాశాలున్నాయని అమెరికాలోని ఓరెగాన్‌ స్టేట్‌ యూనివర్సిటీ పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. టీనేజ్‌ దశలో జీవ సంబంధంగా మానసికంగా మెదడు పరిణితి సాధిస్తుందని, ఆ దశలో మద్యం సేవిస్తే న్యూరాన్లపై చెడు ప్రభావం చూపుతుందని వెల్లడించారు.