రక్తపోటు రహస్యం తెలిసింది!

మస్కో,11-3-2017: రక్తపోటు(బీపీ)కి మూలాన్ని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇది ఒక వయసు దాటిన తర్వాత అకస్మాత్తుగా వచ్చేయదని, చిన్న వయసులోనే మెదడు పనితీరులో, రక్త ప్రసరణలోజరిగే మార్పులవల్లే వస్తుందన్నారు. అధిక రక్తపోటువల్ల మెదడు, కిడ్నీ, గుండె, కళ్లు తదితర భాగాలకు సంబంధించిన తీవ్రమైన వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉంది. రక్తపోటు రాకకు గల మూల కారణం మాత్రం ఏళ్లుగా రహస్యంగానే మిగిలిపోయింది. తాజాగా రష్యాకు చెందిన ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైటోలజీ అండ్‌ జెనిటిక్స్‌ శాస్త్రవేత్తలు నాలుగు నుంచి ఆరేళ్ల మధ్య వయసున్న ప్రయోగాలు చేసి బీపీ గుట్టువిప్పారు.