బ్లడ్‌ ప్రెషర్‌ను తగ్గించే నారింజ

ఆంధ్రజ్యోతి(07-02-2017): ప్రస్తుతం నారింజపండ్లు మార్కెట్లో ఎక్కువగా లభిస్తున్నాయి. తియ్యటి ఈ నారింజపండ్లలో విటమిన్‌-సి పుష్కలంగా ఉంటుంది. ఐరన్‌, మెగ్నీషియం, సోడియంతో పాటు విటమిన్‌-బి కూడా ఉంటుంది. ఇంతకీ నారింజపండ్ల వల్ల కలిగే ఉపయోగాలేంటో తెలుసుకుందాం.

 నారింజపండ్లలో నీటిశాతం ఎక్కువ. నీటిశాతం శరీరంలో తక్కువైన వారికి నారింజరసం తాగిస్తే ఉపశమనం పొందుతారు. 
 నోటిదుర్వాసనని పోగొట్టే గుణం వీటికుంది. ఆకలి తక్కువగా ఉండేవారు ఆరెంజ్‌ తింటే ఆకలి బాగా పుడుతుంది. 
 అధికంగా ఉండే బ్లడ్‌ప్రెషర్‌ను తగ్గిస్తుంది. ఫలితంగా గుండెవ్యాధులు వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది. 
 వీటిలో ఉండే లాక్టిక్‌ ఆమ్లం వల్ల జీర్ణసంబంధ సమస్యలు తొలగిపోతాయి. 
 ఆరెంజ్‌పండ్లలో ఉండే విటమిన్‌-సి వల్ల కీళ్లనొప్పులు తగ్గే అవకాశం ఉంది. 
 ప్రతిరోజూ ఆరెంజ్‌ జ్యూస్‌ తాగటం వల్ల కిడ్నీలో ఉండే స్టోన్స్‌ కరిగే అవకాశమెక్కువ అని పరిశోధనల్లో తేలింది. 
 కొవ్వుశాతంను తగ్గించటంతో పాటు వ్యాధినిరోధకశక్తిని పెంచే గుణం వీటికుంది.