అధిక రక్తపోటుకు కొత్త కారణం..!

లండన్‌, ఏప్రిల్‌ 22: రక్తనాళాల్లో ఉరుకులు పరుగులు తీస్తూ చాప కింద నీరులా శరీర వ్యవస్థకు తీ వ్రహాని కలిగించే అధిక రక్తపోటుకు బర్మింగ్‌హామ్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు కొత్త కారణం కనుగొన్నా రు. అడ్రినల్‌ హార్మోన్‌ ఆల్డోస్టెరోన్‌ అధికంగా ఉత్పత్తి చేయటం వల్ల మాత్రమే కాకుండా సె్ట్రస్‌ హార్మోన్‌ కార్డిసోల్‌ అధిక ఉత్పత్తి వల్ల కూడా హైబీపీ వస్తుందన్నారు. దీనికి ‘కాన్‌షింగ్‌ సిండ్రోమ్‌’ అని నామకర ణం చేశారు. వ్యాధి బాధితులు ఆల్డోస్టెరోన్‌కి మాత్ర మే చికిత్స తీసుకుంటున్నారని, అందువల్ల పెద్దగా లాభం లేకపోయిందని వివరించారు.