ఇంటర్నెట్‌తో రక్తపోటు!

03-08-2017: ఇంటర్నెట్‌ ఉపయోగించే వారిలో రక్తపోటు పెరిగే అవకాశం ఉందని అమెరికా పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. 18 నుంచి 35 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న 144 మందిని వీరు పరిశీలించారు. వీరందరినీ కొంతసేపు ఇంటర్నెట్‌ను ఉపయోగించమన్నారు. అనంతరం వారి ఆరోగ్యాన్ని పరిశీలించారు. వీరిలో రక్తపోటు, గుండె కొట్టుకోవడంలో మార్పులను గుర్తించారు. ఇదంతా ఇంటర్నెట్‌ ప్రభావమేనని వారు అంటున్నారు. ఇంటర్నెట్‌ను ఎంత ఎక్కువ సేపు ఉపయోగిస్తే అంత ఎక్కువగా రక్తపోటు, గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉందని వారు హెచ్చరిస్తున్నారు. ఇంటర్నెట్‌ను ఏకబిగిన కాకుండా మధ్యలో కొద్దిసేపు విరామం ఇచ్చే వారిలో ఈ ప్రమాదం కొద్దిగా తగ్గుతుందనిన వారు చెబుతున్నారు. రోజు మొత్తం మీద గంటా లేదా రెండు గంటల కన్నా ఎక్కువ సేపు ఇంటర్నెట్‌ను చూడడం ఆరోగ్యానికి తీవ్రమైన హాని చేస్తుందని వారు స్పష్టం చేస్తున్నారు.