వైద్యులకూ రక్త‘పోటు’!

న్యూఢిల్లీ, మే 17: ప్రపంచ రక్తపోటు దినం సందర్భంగా ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ దేశవ్యాప్తంగా 33 నగరాల్లో 533 మంది వైద్యులకు నిర్వహించిన ఏబీపీఎం (యాంబ్యులేటరీ బ్లడ్‌ ప్రెజర్‌ మానిటరింగ్‌)లో ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. ఇంట్లోనో, ఆస్పత్రిలోనో ఏదో ఒకసారి బీపీ చెక్‌ చేయ డం కాకుండా.. ఒక వ్యక్తి రక్తపోటును 15-30 నిమిషాలకు ఓసారి చొప్పున 24 గంటలపాటు చెక్‌ చేయడమే ఏబీపీఎం. సాధారణ బీపీ చెకప్‌కన్నా ఇది సమర్థమైన పద్ధతి. 533 మందిలో 21ు మందికి మాస్క్‌ డ్‌ హైపర్‌టెన్షన్‌ ఉన్నట్టు తేలింది. అంటే.. వీరు బీపీ చెక్‌ చేయించుకున్నప్పుడు సాధారణ స్థాయిలోనే ఉంటుంది. రోజంతా చెక్‌ చేసినప్పుడే వారికి రక్తపోటు ఉన్న విషయం బయటపడుతుంది. ఇది దీర్ఘకాలంలో హాని చేస్తుంది.