అధిక రక్తపోటే అసలు కారణం

ఆంధ్రజ్యోతి, 06-03-2017:మా అమ్మగారికి 70 ఏళ్లు. గత 20 ఏళ్లుగా ఆమెకు అధిక రక్తపోటు సమస్య ఉంది. క్రమం తప్పకుండా ప్రతిరోజూ హోమియో మాత్రలు వేసుకుంటూ ఉంటుంది. కాకపోతే ఆహార పదార్థాల్లో ఉప్పు ఎక్కువగా వేసుకుంటుంది. గత రెండు మాసాలుగా కళ్లు తిరుగుతున్నాయని చెబుతోంది. ఈ కారణంగా మంచం మీది నుంచి లేవడానికే భయపడుతోంది. కదలకుండా మంచం మీదే ఉండిపోవడం వల్ల శరీర శ్రమ బొత్తిగా లేక రోజురోజుకూ జీర్ణశక్తి, ఆకలి తగ్గిపోతున్నాయి. పరిష్కారం చెప్పండి. 

-డి.వీణ, వరంగల్‌
 
దీర్ఘకాలికంగా అధిక రక్తపోటు ఉన్నవారిలో కొంతమంది ఈ తరహా కళ్లు తిరిగే సమస్యకు గురవుతుంటారు. దీనికి తోడు ఉప్పు కూడా ఎక్కువగా తీసుకోవడం వల్ల సమస్య మరింత తీవ్రమవుతోంది ఆ అలవాటు అలాగే ఉంటే వేసుకునే మందుల వల్ల కూడా ప్రయోజనం ఉండదు. ఆందువల్ల ఆమెకు ఉప్పు వల్ల జరిగే నష్టం గురించి సావధానంగా వివరించండి. ఉప్పు మోతాదును బాగా తగ్గించండి. వెంటనే హోమియో వైద్య నిపుణున్ని సంప్రదిస్తే కొద్ది రోజుల వ్యవధిలోనే సమస్య నుంచి పూర్తిగా బయటపడవచ్చు
-డాక్టర్‌ బి. సోహన్‌ సింగ్‌, హోమియో వైద్య నిపుణులు