‘పోటు’ ఎప్పుడైనా చేటే

హ్యూస్టన్‌, మే 20,2017: యుక్త వయసులో అధిక రక్తపోటు ఉన్న వారికి తర్వాత స్ర్టోక్‌, మూత్రపిండ సమస్యలు, మెదడు సమస్యలు వచ్చే ప్రమాదముందని యూనివర్సిటీ ఆఫ్‌ టెక్సాస్‌ పరిశోధకులు అంటు న్నారు. ఆరోగ్యకర ఐసోలెటెడ్‌ సిస్టాలిక్‌ హైపర్‌టెన్షన్‌ రోగులకు హృద్రోగాలు వచ్చే అవకాశాలను తెలుసుకునేందుకు 2001 మంది రోగుల గుండెలను అధ్యయ నం చేశారు. యువతలో రక్తపోటు కాస్త ఎక్కువగా ఉన్నా వైద్యులు పెద్దగా పట్టించుకోకపోవడం సరైన పద్ధతి కాదన్నారు. సిస్టాలిక్‌ రక్తపోటు 140 కన్నా అధికంగా ఉంటే వారికి కొన్నేళ్ల తర్వాత స్ర్టోక్‌, కిడ్నీ, మెద డు సమస్యలొస్తాయన్నారు. రక్తపోటు 120/80, అంతకన్నా తక్కువ ఉంటే శ్రేయస్కరమన్నారు.