సూది లేకుండా షుగర్‌ టెస్ట్‌!

లండన్‌, జనవరి 6: కనీసం సూదిపోటు నొప్పి కూడా లేకుండా షుగర్‌ పరీక్ష చేసుకునే ఒక సరికొత్త పరికరాన్ని స్వీడన్‌లోని కేటీహెచ్‌ రాయల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ శాస్త్రవేత్తలు రూపొందించారు. వారు అభివృద్ధి చేసిన మైక్రోనీడిల్‌ ప్యాచ్‌తో రక్తంలో చక్కెర స్థాయిలను పర్యవేక్షించవచ్చు. శరీరానికి ప్యాచ్‌ వేసినట్టు కనిపించే ఈ పరికరం అందుబాటులోకి వస్తే రక్త నమూనా కోసం రోజులో అనేకసార్లు సూదితో పొడిపించుకునే బాధ తప్పుతుందని పరిశోధకులు చెబుతున్నారు. ఈ నమూనా పరికరాన్ని మనుషులపై ప్రయోగాత్మకంగా పరీక్షించారు. ప్రస్తుతం క్లినికల్‌ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం షుగర్‌ టెస్టు కోసం కనీసం 7ఎంఎం సూదిని వినియోగిస్తున్నారు. అయితే దానికి 50 రెట్లు చిన్నదైన మైక్రోనీడిల్‌ ప్యాచ్‌తో తాజా పరికరాన్ని రూపొందించామని శాస్త్రవేత్తలు వెల్లడించారు.