నడకతో కాలేయ రోగులకు ఊరట

21-05-2019: నడకతోపాటు, కండరాలను బలోపేతం చేసే వ్యాయామాలు కాలేయ రోగులకు మరణం ముప్పును గణనీయంగా తగ్గిస్తాయని తాజా అధ్యయనంలో తేలింది. ఊబకాయం వల్ల కూడా దీర్ఘకాలిక కాలేయ వ్యాధి వ్యాప్తి చెందుతోంది. 68,449 మంది మహిళలు, 48,748 మంది పురుషులను ఈ బృందం అధ్యయనం చేసింది. ఈ అధ్యయనం కాలేయ రోగులకు ఎంతగానో ఉపయోగపడుతుందని అమెరికాలోని హార్వర్డ్‌ మెడికల్‌ స్కూల్‌కు చెందిన పరిశోధకుడు ట్రేసీ సిమన్‌ చెప్పారు. పెద్ద వయసులోని కాలేయ రోగుల్లో వారంలో అత్యధికంగా వాకింగ్‌ చేసేవారికి 73 శాతం మరణం ముప్పు తగ్గిందన్నారు. నడకతోపాటు కండరశక్తి పెంచే వ్యాయామాలు కూడా చేసినవారికి ముప్పు మరింత తగ్గిందని పేర్కొన్నారు.