శరీరంలోపల నుంచే చికిత్స చేసే స్మార్ట్‌ గోళి

14-09-2017: ‘ఆటమ్స్‌’ సిలికాన్‌ చిప్‌ కలిగిన సూక్ష్మమైన స్మార్ట్‌ గోళి. అమెరికాకు చెందిన కాలిఫోర్నియా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ పరిశోధకుల అద్భుత సృష్టి. ఏదైనా వ్యాధి వస్తే ఈ గోళిని మనం మింగితే చాలు.. శరీరం లోపలి నుంచే మనకు చికిత్స చేస్తుంది. రక్తాన్ని, మెదడును, జీర్ణశయాంతర లోపాలను పసిగడుతుందట. హైడ్రోజన్‌ సంభావ్యత(పీహెచ్‌), శరీర ఉష్ణోగ్రత, పీడనం, చక్కెర స్థాయుల్ని కూడా కొలుస్తుందట. అంతేకాదు, ఔషధాలు వేసుకోవాలనీ సూచిస్తుందట. అయస్కాంత క్షేత్రం సాయంతో అది శరీరంలో ఎక్కడుందో కనుక్కోవచ్చని శాస్త్రవేత్తలు వివరించారు.