గుండాలతో వణుకుడు రోగం గుర్తింపు

08-09-2017: వయసు మీదికొస్తున్న కొద్దీ చాలా మందిలో వణుకుడు రోగం వస్తుంది. అది భయటపడేకంటే చాలా రోజుల ముందే ఈ వ్యాధిని గుర్తించవచ్చని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఒక పేపర్‌ తీసుకుని దానిపై గుండాలు గీస్తే దాన్ని బట్టి రోగం వస్తుందా! రాదా! అనేది కనిపెట్టవచ్చని చెబుతున్నారు. దానికోసం స్వయం చాలక ఎలకా్ట్రనిక్‌ వ్యవస్థను రూపొందించామని, పలకలాంటి ఆ పరికరంపై గుండం గీసినపుడు పెన్ను తిరిగే వేగం, మనం అమలు చేసే ఒత్తిడిని బట్టి వణుకుడును గుర్తించవచ్చని ఆస్ట్రేలియాలోని ఆర్‌ఎమ్‌ఐటీ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు తెలిపారు.