రక్త ప్రసరణను పర్యవేక్షించే సెన్సర్‌!

బోస్టన్‌, జనవరి 9: ధమనుల్లో రక్త ప్రసరణను పర్యవేక్షించేందుకు శాస్త్రవేత్తలు ఒక బయోడీగ్రేడబుల్‌ (జీవశైధిల్య) సెన్సర్‌ను రూపొందించారు. బ్యాటరీ అవసరం లేని ఈ వైర్‌లెస్‌ సెన్సర్‌.. రక్తనాళాల శస్త్రచికిత్సలో డాక్టర్లకు ఎంతగానో ఉపయోగపడుతుందని అమెరికాలోని స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీ పరిశోధకులు తెలిపారు. రోగి శరీరంలో ఎక్కడైనా రక్తం నిలిచిపోతే ఈ పరికరం వెంటనే డాక్టర్‌ను హెచ్చరిస్తుంది.