ఆలివ్‌నూనెతో మధుమేహానికి అడ్డుకట్ట

14-09-2017: మధుమేహానికి ఆలివ్‌నూనె వాడటం మేలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. అందులో ఉండే ‘ఒలెరోపిన్‌’ సమ్మేళనం ఎక్కువ ఇన్సులిన్‌ స్రవించేలా శరీరానికి సాయం చేసి, మధుమేహాన్ని అడ్డుకుట్టుందని అమెరికాలోని వర్జీనియా పాలిటెక్నిక్‌ ఇనిస్టిట్యూట్‌ అండ్‌ స్టేట్‌ యూనివర్సిటీ (వర్జీనియా టెక్‌) పరిశోధకులు తెలిపారు. ఆలివ్‌నూనెలో ఉండే ఆయుర్వేద గుణాలు రోగ క్రిమినాశకంగా పనిచేస్తాయని వెల్లడించారు.