నెట్‌ వాడకం ఎక్కువైతే మెదడుకు దెబ్బే

ఏకాగ్రతపైనా ప్రభావం: సిడ్నీ వర్సిటీ

09-06-2019: తక్కువ ఖర్చుతో నెలకు సరిపడా ఇంటర్నెట్‌ ప్యాక్‌ వస్తోంది కదా అని, చాలా మంది అదే పనిగా అంతర్జాలంలోనే గడిపేస్తున్నారు. ఇంటర్నెట్‌ వాడకం మరీ ఎక్కువైతే.. అది ఏకంగా మన మెదడు పనితీరునే మార్చేయవచ్చని హెచ్చరిస్తున్నారు సిడ్నీ యూనివర్సిటీ పరిశోధకులు. నెట్‌ వాడకం మెదడులో జ్ఞాపకశక్తికి సంబంధించిన భాగంపై ఎక్కువగా ప్రభావం చూపుతోందని, తద్వారా మస్తిష్క పనితీరు బాగా మందగిస్తోందని వారు చెప్పారు. అంతేకాకుండా ఇంటర్నెట్‌ వాడుతున్నప్పుడు వచ్చే నోటిఫికేషన్ల వల్ల ఏకాగ్రత కూడా దెబ్బతింటోందని వారు తెలిపారు.