సోషల్‌ మీడియాతో మానసిక రుగ్మత!

హౌస్టన్‌, జనవరి 9: ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ వంటి సోషల్‌ మీడియాలో ఎక్కువ సమయం గడపడం, తమను ఇతరులతో పోల్చుకోవడం వంటి ప్రతికూల లక్షణాలు తీవ్రమైన మానసిక రుగ్మతకు సూచనలని అమెరికాలోని టెక్సాస్‌ స్టేట్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఫేస్‌బుక్‌, ట్విటర్‌, ఇన్‌స్టాగ్రామ్‌, స్నాప్‌చాట్‌ వంటి సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉన్న 504 మంది టీనేజర్లపై శాస్త్రవేత్తలు అధ్యయనం చేశారు. వారిలో ఎక్కువమందికి సోషల్‌ మీడియాలో గడపడం వ్యసనంగా మారి ఎదుటివారికంటే తాము తక్కువనే భావనలో ఉంటారని గుర్తించారు. ప్రాముఖ్యత లేని చిత్రాల్లో తమను ట్యాగ్‌ చేయడానికి, అలాగే ఇతర వ్యక్తులతో కలిసి దిగిన ఫొటోలను పోస్ట్‌ చేయడానికి కూడా వారు ఇష్టపడరని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.