మెనోపాజ్‌ చికిత్సతో గుండెకు మేలు

10-03-2018: మహిళల్లో మెనోపాజ్‌ దశ త్వరగా రాకుండా ఈస్ట్రోజెన్‌, ప్రొజెస్టెరాన్‌ హార్మోన్ల స్థాయుల్ని పెంచేదే మెనోపాజ్‌ హార్మోన్‌ చికిత్స. ఈ చికిత్స చేయించుకుంటే రుతువిరతి ఆలస్యమవడమే కాకుండా హృదయ సంబంధ వ్యాధులు దరిచేరవని క్వీన్‌మేరీ యూనివర్సిటీ ఆఫ్‌ లండన్‌కు చెందిన భారత సంతతి శాస్త్రవేత్త మిహిర్‌ సంఘ్వీ తెలిపారు.