మంట పుట్టని ఆహారంతో దీర్ఘాయుష్షు

వాషింగ్టన్‌, జనవరి 7: ఆరోగ్యంగా ఉండేందుకు చాలామంది రకరకాల వ్యాయమాలు చేస్తుంటారు. ఆహారపు అలవాట్లను పాటిస్తుంటారు. అయితే, కడుపులో మంట పుట్టనివ్వని పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు వంటి ఆహారాన్ని అధికంగా తీసుకోవ డం వల్ల ఎక్కువ కాలం ఆరోగ్యంగా జీవించవచ్చని తాజా అధ్యయనంలో తేలింది. 68,273 మందిపై పరిశోధన జరిపిన పోలండ్‌లోని వార్సా వర్సిటీ ఆఫ్‌ లైఫ్‌ సైన్సెస్‌ పరిశోధకులు ఈ విషయాన్ని గుర్తించారు. ఇలాంటి ఆహారాన్ని తీసుకోవడంతో పాటు ఉప్పు, సంతృప్త కొవ్వులు తక్కువగా తీసుకోవడం వల్ల కేన్సర్‌ వచ్చే ముప్పు 13%, హృద్రోగాల ముప్పు 20% తగ్గిందని పరిశోధకులు తెలిపారు.