వేగంగా నడిస్తే దీర్ఘాయువు!

19-05-2019: వేగంగా నడిచే వారు ఎక్కువ కాలం జీవిస్తారని తాజా సర్వే పేర్కొంది. ఇప్పటికే నడక అలవాటు ఉన్నవారు ఇకపై వేగంగా నడిచేందుకు ప్రయత్నిస్తే మంచి ఫలితాలు ఉంటాయని చెబుతోంది. బ్రిటన్‌కు చెందిన నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ హెల్త్‌ రీసెర్చ్‌ సంస్థ ఈ అధ్యయనం చేపట్టింది. దాదాపు 4.74లక్షల మంది డేటాను పరిశీలించింది. శరీర బరువుతో సంబంధం లేకుండా నడక వేగం మనిషి ఆయుర్దాయం పెంచుతుందని వివరించింది. మనిషి సగటు జీవితకాలం పురుషులైతే 64.8 సంవత్సరాలు, మహిళలకు 72.4 ఏళ్లుగా తేల్చారు. వ్యాయా మంపై ఆసక్తి ఉన్నవారికి ఈ సర్వే మంచి ఉత్సాహాన్నిస్తుందని ప్రొఫెసర్‌ టామ్‌ యేట్స్‌ తెలిపారు.