నిద్రలేమి.. జన్యులోపం!

11-03-2018: సరిగా నిద్రపట్టడం లేదనే ఫిర్యాదులు తరచూ వింటుంటాం. కొందరు నిద్ర మాత్రలు వేసుకోవాల్సిన పరిస్థితి. మానసిక, శారీరక సమస్యల వల్ల ఈ రుగ్మత వచ్చే అవకాశం ఉంటుందని తెలుసు. అవి మాత్రమే కాదు.. జన్యులోపం వల్ల కూడా నిద్రలేమి సమస్య ఉత్పన్నమయ్యే అవకాశం ఉంటుందని అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియా శాస్త్రవేత్తలు తెలిపారు. నిద్రలేమికి, మానసిక రుగ్మతలకు, మధుమేహానికి గల లింకును కూడా గుర్తించినట్లు వెల్లడించారు.