సానుభూతికి జన్యువులూ కారణమే

13-03-2018: ఎదుటివారి కష్టాలు, బాధలను చూసి ఎవరైనా కరిగిపోతుంటారు. వారిపై ఎంతో కొంత సానుభూతి చూపుతుంటారు. వారి కష్టాల్లోని తీవ్రత, భావనలను బట్టి సానుభూతి తీవ్రత ఆధారపడి ఉంటుందని తెలుసు. అయితే ఎదుటివారి ఫీలింగ్సే కాకుండా జన్యువులు కూడా సానుభూతి చూపడంలో కీలకపాత్ర పోషిస్తాయని అంటున్నారు యూకేలోని యూనివర్సిటీ ఆఫ్‌ కేంబ్రిడ్జి పరిశోధకులు. 46వేల మందిపై జరిపిన ఈక్యూ పరీక్షల ఆధారంగా ఈ విషయాన్ని గుర్తించారు.