పాలతో సంతానలేమి సమస్య..?

16-01-2018: పాలు సంపూర్ణపోషకాహారం అన్న మాట మరుగున పడే కాలం వచ్చింది అంటున్నారు అధ్యయనకారులు. ప్రస్తుతం లభిస్తున్న కొన్ని రకాల పాలు తాగడం వలన సంతానలేమి సమస్య ఉత్పన్నమయ్యే ప్రమాదం ఉందని వారు హెచ్చరిస్తున్నారు. మామూలు కన్నా ఎక్కువ పాలు ఇవ్వడానికి కొందరు పశువులకు స్టెరాయిడ్స్‌ ఇస్తున్నారనీ, ఇలాంటి పశువుల ద్వారా సేకరించిన పాలు తాగిన వారిలో వంధత్వ లక్షణాలు కనిపించే అవకాశం ఉందని వారు చెబుతున్నారు. ఆడపిల్లలు చిన్నతనంలోనే యుక్తవయస్సుకి రావడానికి ఇదే కారణం అని వారు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా గర్భవతులు ప్యాకెట్‌ పాలకు దూరంగా ఉంటేనే మంచిదని వారు సూచిస్తున్నారు. పశువుల నుంచి నేరుగా కొనుగోలు చేసిన పాలను కూడా అధిక ఉష్ణోగ్రత వద్ద వేడి చేసినట్టయితే ఈ హార్మోన్ల ప్రభావం అంతగా ఉండదని వారు సూచిస్తున్నారు. పసిపిల్లలకి అయితే రెండు మూడు సార్లు బాగా మరగపెట్టిన తరువాతే తాగించాలని వారు స్పష్టం చేస్తున్నారు.