9 గంటలు మించి కూర్చుంటే ‘ముందస్తు’ మరణం!

23-08-2019: మీరు రోజులో ఎక్కువ సమయం కూర్చునే ఉంటారా? మొత్తం సమయం రోజుకు 9 గంటలకు మించి ఉంటోందా? అలాంటి వారికి ముందుగానే మరణం సంభవించే ముప్పు ఉందని నార్వేజియన్‌ స్పోర్ట్స్‌ స్కూల్‌ పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. నిద్రను మినహాయిస్తే.. మనం కూర్చుని ఉండే సమయం రోజుకు 9 గంటలకు కంటే ఎక్కువ ఉండకూడదని చెబుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాల ప్రకారం 18 - 64 మధ్య వయస్కులు వారానికి కనీసం 75 నిమిషాలపాటు వ్యాయామం చేయాలని, కానీ చాలామంది అది చేయడం లేదని తేల్చారు. దాని కోసం 36,383 మందిపై అధ్యయనం చేశారు. అందరి కంటే తక్కువ శారీరక శ్రమ లేక వ్యాయామం చేసిన 2,149 మంది తమ సగటు జీవితకాలం కంటే ముందుగానే మరణించినట్టు తమ పరిశోధనలో తేలిందని ప్రొఫెసర్‌ అల్ఫ్‌ ఎకిలండ్‌ చెప్పారు.