రంగు మారే కాంటాక్ట్‌ లెన్స్‌తో కంటి చికిత్స

12-10-2018: కంటి చికిత్సకు, పర్యవేక్షణకు, ఔషధాలు అందించేందుకు వీలయ్యే ‘రంగు మారే కాంటాక్ట్‌ లెన్స్‌’ను చైనాలోని ఫార్మాసూటికల్‌ అండ్‌ సౌత్‌ ఈస్ట్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. చుక్కల మందు వేసుకున్నపుడు కొందరికి దురదగా, కళ్లు మంటగా ఉండటం లాంటి సమస్యలు ఎదురవుతాయి. వాటిని గుర్తించి సదరు వ్యక్తికి అవసరమయ్యేలా ఔషధం అందిస్తూ స్వాంతన చేకూరుస్తుందని పరిశోధకులు తెలిపారు.