మధుమేహ రోగులూ ఆపిల్‌ తినొచ్చు!

24-05-2018: మధుమేహం ఉన్నా ఆపిల్‌ ను ఎలాంటి భయం లేకుండా తినవచ్చని శాస్త్రవేత్తలు భరోసా ఇస్తున్నారు. ఆపిల్‌లో కార్బోహైడ్రేట్లు, చక్కెరలు ఉన్నా వాటి వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరగవని అమెరికన్‌ డయాబెటిస్‌ అసోసియేషన్‌ శాస్త్రవేత్తలు వెల్లడించారు. పైగా, ఫైబర్‌.. చక్కెర, ఇన్సులిన్‌ హెచ్చుతగ్గులను నియంత్రిస్తుందని తెలిపారు.