కొత్త మందులతో చెవుడుకు చెక్‌

11-03-2018: కోక్లియర్‌ కణాలు.. ధ్వని సరిగా వినిపించేందుకు దోహదం చేసే కణాలు. సైక్లిన్‌ డిపెండెంట్‌ కైనేస్ (సీడీకే2) అనే ఎంజైమ్‌ వీటి పనితీరును అడ్డుకొని వినికిడి లోపాన్ని కలిగిస్తుంది. ఆ ఎంజైమ్‌ను నియంత్రిస్తే చెవుడుక్‌ చెక్‌పెట్టవచ్చని, దానికి ‘కెన్‌పాలోన్‌’ అనే సమ్మేళనం ఉపయుక్తంగా పనిచేస్తుందని అమెరికాలోని రాక్‌ఫెల్లర్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు తెలిపారు. వినికిడి లోపాన్ని సరిచేసేందుకు దాదాపు 4వేల రకాల ఔషధాలను పరీక్షించగా కెన్‌పాలోన్‌ సీడీకే2 ఎంజెమ్‌ను అణచిపెట్టి ఉంచిందని వివరించారు.