గాఢంగా ఊపిరి తీసుకోవాల్సిందే!

14-02-2018: ఇతర దేశాలతో పోల్చినప్పుడు భారతీయుల ఊపిరితిత్తులు చాలా బలహీనమైనవనీ పరిశోధకులు అంటున్నారు. మిగతా వారి కన్నా భారతీయుల ఊపిరితిత్తులు 30 శాతం బలహీనంగా ఉంటాయని చెబుతున్నారు. దీని కారణంగానే పక్షవాతం, గుండెపోటు, డయాబెటిస్ వంటి వ్యాధులు రావడానికి కారణం అవుతోందన్న విషయం వీరి అధ్యయనంలో వెల్లడైంది. పై ఆరోగ్య సమస్యల బారిన పడకుండా ఉండాలంటే గాఢంగా ఊపిరి తీసుకుని వదులుతూ ఉండాలని వారు సూచిస్తున్నారు. రోజులో కొద్దిసేపు గాఢంగా ఊపిరి తీసుకుని వదులుతూ ఉండడం వలన గుండె, ఊపిరితిత్తుల ఆరోగ్యంతో పాటు రోగనిరోధకశక్తి పెరుగుతుందని వారు చెబుతున్నారు.