గుండెపోటును త్వరగా గుర్తించే పరికరం

13-06-2019: అకస్మాత్తుగా వచ్చే గుండెపోటును ముందుగానే గుర్తించకపోవడం వలన ప్రాణనష్టం ఎక్కువగా ఉంటుంది. దీన్ని నివారించేందుకు చైనా శాస్త్రవేత్తలు సరికొత్త పరికరాన్ని అభివృద్ధి చేశారు. ఈ హైబ్రిడ్‌ పరికరం శరీరంలోని రక్తప్రవాహాన్ని పర్యవేక్షించి రోగాలను నిర్ధారించడమే కాకుం డా గుండెపోటు వచ్చే ప్రమాదాన్ని త్వరగా గుర్తిస్తుందని చైనా అకాడమీ ఆఫ్‌ ఇంజనీరింగ్‌ ఫిజిక్స్‌, ఆర్మీ మెడికల్‌ వర్సిటీ శాస్త్రవేత్తలు తెలిపారు. రక్తం పరిమాణం, ఆక్సిజన్‌, రక్త ప్రవాహాన్ని ఈ పరికరం పర్యవేక్షిస్తుంది. మెదడుకు చేరే రక్త ప్రసరణలో ఏదైనా తేడా అనిపిస్తే దాన్ని పసిగడుతుంది. తద్వారా గుండెపోటు ప్రమాదాన్ని ముందే హెచ్చరించడం వలన సరైన చికిత్స తీసుకోవచ్చని పరిశోధకులు తెలిపారు.