గాలి కాలుష్యంతో మేధోవైకల్యం

10-03-2018: గాలికాలుష్యం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో నివసించే గర్భిణులకు పుట్టబోయే పిల్లల్లో మెదడు మందగించి, జ్ఞాపకశక్తి కోల్పోతారని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఆ గాలిని పీల్చినపుడు ధూళికణాలు గర్భంలోకి చేరి పిండంపై చెడు ప్రభావం చూపుతాయని, మెదడు ఎదుగుదలకు అవరోధంగా మారుతాయని స్పెయిన్‌లోని బార్సెలోనా ఇనిస్టిట్యూట్‌ ఫర్‌ గ్లోబల్‌ హెల్త్‌ పరిశోధకులు తెలిపారు. అది మానసిక సమస్యలకు దారితీసే ప్రమాదం ఉందన్నారు.