అరుదైన రోగాలను గుర్తించే ఏఐ!

11-06-2019: ఏటా ప్రపంచవ్యాప్తంగా 5లక్షల మంది చిన్నారులు వంశపారంపర్యంగా వచ్చే అరుదై న వ్యాధులతో పుడుతున్నారు. వారిలోని లోపాలను గుర్తించడం, రోగనిర్ధారణ కష్టంగామారింది. ఈ సమస్యను అధిగమించేందుకు జర్మనీలోని బాన్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌(ఏఐ)ను అభివృద్ధి చేశారు. ఏఐ సాయంతో రోగికి సంబంధించి న జన్యు సమాచారం, రేఖా చిత్రాల ఆధారంగా అరుదైన వ్యాధులను కచ్చితత్వంతో గుర్తించవచ్చని 105 రకాల అరుదైన వ్యాధులతో బాధపడే 679 మందిపై అధ్యయనం చేసిన బాన్‌వర్సిటీ శాస్త్రవేత్తలు చెప్పారు.