హోదాతో ఆరోగ్యం

ఆంధ్రజ్యోతి,10-12-2016:ధనవంతులు పేదవారికన్నా పది పది హేను సంవత్సరాలు ఎక్కువ జీవిస్తారన్న విషయం గతంలో నిర్వహించిన పరిశోధనల్లో వెల్లడైంది. దీనికి రకరకాల కారణాలను వారు విశ్లేషించారు. పోషకాహారం, వ్యాయామం, మంచి మందులు వారి జీవితకాలాన్ని పెంచుతాయన్న విషయం స్పష్ట మైంది. ఇప్పుడు హోదా కూడా ఆరోగ్యాన్ని ఇస్తుందన్న విషయం వీరి పరిశోధనల్లో తేలింది. సుమారు 45 కోతుల మీద వీరు పరిశోధనలు నిర్వహించారు. వీటిని బృందాలుగా విభజించారు. కొన్ని రోజులకు బృందంలోని ఓ కోతి ఆఽధిపత్యం చెలా యిస్తే మిగతా కోతులు దాని అదుపు ఆజ్ఞలలో మసులు కునేవి. కొన్ని నెలల తరు వాత కోతుల ఆరోగ్యాన్ని పరి శీలించారు. లీడరుకోతి మునుపటి కన్నా ఆరోగ్యంగా ఉండగా, మిగతా కోతుల్లో రకరకాల ఆరోగ్య సమస్యలను గమనించారు. వీటిలో కణాలు అస్తవ్యస్తమవడం గమనించారు. హోదా కలిగిన కోతికీ, మిగతా కోతుల ఆరోగ్యానికి చాలా స్పష్టమైన మార్పు కనిపించిందని పరిశోధకులు చెబుతున్నారు. ఈ మార్పు మనుషుల్లో కూడా కలుగుతుందా? అన్న విషయం మీద వీరు పరిశోధనలు నిర్వహిస్తున్నారు.