పసుపు పచ్చటి అందం

ఆంధ్రజ్యోతి, 28-11-2016: చర్మం నిగారింపుతో మెరిసిపోవాలంటే పసుపు తరువాతే ఏదైనా... అంత బాగా పనిచేస్తుంది. అందులోనూ చలికాలంలో డల్‌గా మారిపోయిన చర్మం మీద పసుపు ఫేస్‌ప్యాక్‌ ప్రభావంతంగా ఉంటుంది. 

కల్తీలేని పసుపు - ఒక టీస్పూన్‌, శెనగపిండి - నాలుగు టేబుల్‌ స్పూన్లు, పాలు లేదా నీళ్లు - సరిపడా తీసుకోవాలి. 

పసుపు, శెనగపిండిని ఒక గిన్నెలోకి తీసుకుని అందులో పాలు లేదా నీళ్లు పోసి గుజ్జులా కలపాలి. 

ఈ గుజ్జును ముఖం, మెడలకు పూసుకుని పావుగంట నుంచి ఇరవై నిమిషాలు ఉంచుకుని తరువాత నీళ్లతో కడిగేయాలి. 

ఈ ప్యాక్‌ను వారానికి రెండుసార్లు వేసుకోవాలి. పసుపులో ఉండే కుర్‌కుమిన్‌లో యాంటీఆక్సిడెంట్‌, యాంటీ ఇన్‌ఫ్లెమేటరీ గుణాలు ఉన్నాయి. చర్మాన్ని దెబ్బతీసే ఫ్రీరాడికల్స్‌ను ఇవి పోగొడతాయి. అంతేకాకుండా కొల్లాజెన్‌ ఉత్పత్తిని వృద్ధిచేస్తాయి. దీనివల్ల చర్మం మృదువుగా అయితే... శెనగపిండి చర్మాన్ని శుభ్రపరచడంతో చర్మం మెరిసిపోతుంది