ముఖ సౌందర్యానికి బ్యూటి టిప్స్

ఆంధ్రజ్యోతి(10-01-2017)

నిమ్మరసం: ఇందులో యాంటీసెప్టిక్‌ గుణాలుంటాయి. దీనిలో ఉండే సిట్రికాసిడ్‌ స్కిన్‌ పీహెచ్‌ బ్యాలెన్స్‌ను రీస్టోర్‌ చేస్తుంది. నిమ్మరసాన్ని యాసి్ట్రంజెంట్‌గానూ ఉపయోగిస్తారు. నిమ్మరసంలో డిస్టిల్‌ వాటర్‌ కలిపి దూదితో ముఖానికి అప్లై చేయాలి. పదినిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో కడిగేసుకుని మాయిశ్చర్‌ను అప్లై చేయాలి. అవసరమైతే నిమ్మరసంలో తేనె కలుపుకుని ఫేస్‌ప్యాక్‌గా వేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల ముఖం జిడ్డుబారడం సమస్య తొలగిపోతుంది. 

ఎగ్‌వైట్‌: ఎగ్‌వైట్‌ ఉపయోగించిన ఫేస్‌ప్యాక్స్‌ అదనపు ఆయిల్‌ను తొలగించడానికి బాగా ఉపయోగపడతాయి. ఎగ్‌వైట్‌ను ముఖానికి ప్యాక్‌ మాదిరిగా వేసుకుని ఆరనివ్వాలి. అయితే శుభ్రం చేసుకునే వరకు మాట్లాడటం, ఫేసియల్‌ ఎక్స్‌ప్రెషన్స్‌ ఇవ్వడం చేయకూడదు. ఈ ప్యాక్‌ చర్మాన్ని బిగుతుగా చేస్తుంది. ఎగ్‌వైట్‌లో తేనె, పాలు కలుపుకుంటే ప్రయోజనం మరింత ఎక్కువగా ఉంటుంది. 

పెరుగు: పెరుగును ముఖానికి ప్యాక్‌ మాదిరిగా పట్టించి పావుగంట తరువాత చల్లని నీటితో కడిగేసుకోవాలి. పెరుగులో కొంచెం తేనె కలిపి పట్టించుకుంటే మాయిశ్చర్‌గానూ పనిచేస్తుంది. వారంలో ఒకరోజు ఇలా చేయడం వల్ల చర్మంలో జిడ్డుదనం లేకుండా పోతుంది. 

టొమోటో: వీటిలో విటమిన్‌ సి ఎక్కువగా ఉంటుంది. టొమాటోల్లో ఉండే నేచురల్‌ ఆయిల్‌ అబ్జార్బింగ్‌ యాసిడ్స్‌ ముఖంపై వచ్చే అదనపు అయిల్‌ను తొలగించడానికి తోడ్పతాయు. టొమోటోను రెండు ముక్కలుగా కట్‌ చేసి ముఖంపై రబ్‌ చేసుకోవాలి. పావుగంట తరువాత చల్లని నీటితో కడిగేసుకోవాలి.