బ్యూటి టిప్స్‌

ఆంధ్రజ్యోతి 15-01-2017 :
 పాలు : డబ్బులు వెచ్చించి క్లీన్సింగ్‌ మిల్క్‌ కొనే బదులుగా స్వచ్ఛమైన పాలను ఉపయోగించవచ్చు. పాలు డస్ట్‌ను తొలగించడమే కాకుండా చర్మరంధ్రాలలో ఉన్న మలినాలను తొలగిస్తాయి. మరిగించిన పాలు కాకుండా పచ్చిపాలను ఉపయోగించడం మేలు. 
దోసకాయ : ఇందులోనూ ఆసి్ట్రంజెంట్‌ గుణాలుంటాయి. దోసకాయ ముక్కలతో ముఖంపై నెమ్మదిగా రబ్‌ చేయాలి. ఇలా చేయడం వల్ల జిడ్డు తొలగిపోయుయి చర్మం నిగారింపు సంతరించుకుంటుంది. 
కలబంద : కలబందను కట్‌ చేసి జెల్‌ను ముఖానికి రాసుకోవాలి. దాన్ని అరగంటపాటు వదిలేసి తరువాత నీటితో శుభ్రం చేసుకోవాలి. అలొవెరా జెల్‌ మార్కెట్లో కూడా లభిస్తుంది. రోజూ రెండు సార్లు రెండు వారాల పాటు చేస్తే ఆయిల్‌ స్కిన్‌ సమస్యలు దూరమవుతాయి.