యవ్వన చర్మానికి...

03-10-2018: బొప్పాయి పోషకాలతో నిండి ఉన్న పండు. ఆరోగ్యానికే కాదు చర్మానికి కూడా బొప్పాయి మేలు చేస్తుంది.
 
చర్మం పొడిబారకుండా: బొప్పాయిలో 80శాతం పైగా నీరు ఉంటుంది. బొప్పాయి తింటే చర్మం డిహైడ్రేషన్‌కు లోనవదు.
 
మొటిమలు: బొప్పాయిలో పపైన్‌ ఎంజైమ్‌ ఉంటుంది. ఇది చర్మంలో కూరుకుపోయిన మలినాలను, చర్మం మీది మృత కణాలను తొలగిస్తుంది. బొప్పాయ గుజ్జును ముఖానికి రాసుకుంటే, మొటిమలు తగ్గుతాయి.
 
యవ్వన చర్మం: బొప్పాయిలో విటమిన్‌ సి అధికంగా ఉంటుంది. ఇది చర్మంలోని మలినాలను తొలగిస్తుంది. చర్మం రంగును పెంచి, కాంతిమంతం చేస్తుంది.