ఈ ఆయిల్స్‌తో ముడతలు మాయం!

22-03-2019: వయసు పెరిగేకొద్దీ చర్మం మీద ముడతలు, మచ్చలు ఏర్పడడం సహజం. అయితే వీటిని ఎసెన్షియల్‌ ఆయిల్స్‌తో అదుపులో ఉంచవచ్చు. అదెలాగంటే....
 
ఎసెన్షియల్‌ ఆయిల్స్‌ అంటే?
సహజసిద్ధమైన పదార్థాలను స్టీమ్‌ (ఆవిరి), డిస్టిలేషన్‌ (స్వేదనం), రెసిన్‌ ట్యాపింగ్‌, కోల్డ్‌ ప్రెసింగ్‌ అనే పద్ధతుల ద్వారా సేకరించి తీసిన నూనెలే ఎసెన్షియల్‌ ఆయిల్స్‌. ఈ నూనెలకు వేల సంవత్సరాల చరిత్ర ఉంది. వీటి ద్వారా శారీరక, మానసిక సమస్యలు నయం చేయగలిగినట్టు చారిత్రక ఆధారాలూ ఉన్నాయి. ఎసెన్షియల్‌ ఆయిల్స్‌ సువాసనలు పీల్చడం, నోటి ద్వారా సేవించడం, పైపూతగా వాడడం ద్వారా ఈ ఫలితాలను పొందవచ్చు.
 
జిరేనియం ఆయిల్‌: వయసుతో వచ్చే ముడతలకు ఈ నూనె వాడాలి. ఇది సహజసిద్ధమైన యాస్ట్రింజెంట్‌లా పని చేసి చర్మాన్ని బిగుతుగా మారుస్తుంది. ఈ నూనెలో యాంటీ ఆక్సిడెంట్లు చర్మ రక్షణకూ తోడ్పడతాయి. గంధపు నూనెతో కలిపి చర్మం మీద పూసుకుంటే రెట్టింపు ఫలితం ఉంటుంది.