వీక్లీ ప్యాక్స్‌!

02-05-2019: చర్మం మీది మరకలు, మచ్చలు తొలగించి, తాజాదనం సంతరించుకోవాలంటే వారానికి ఒకసారైనా ఫేస్‌ప్యాక్‌ వేసుకోవాలి. ఆ ప్యాక్స్‌ ఎలా వేసుకోవాలంటే?
 
కొబ్బరినూనె, బేకింగ్‌ సోడా సమపాళ్లలో తీసుకుని ఓ గిన్నెలో కలుపుకోవాలి. బేకింగ్‌ పౌడర్‌ గడ్డలు కట్టకుండా నూనెలో పూర్తిగా కరిగేవరకూ కలపాలి. ఈ మిశ్రమాన్ని ముడతలు ఎక్కువగా ఉండే నుదురు, కళ్ల కింది భాగం, పెదవుల చుట్టూ వేళ్లతో సున్నితంగా రుద్దాలి. తర్వాత ఐదు నిమిషాలు ఆగి గోరువెచ్చని నీటితో కడిగేసుకోవాలి.
అరటి పండును మెత్తగా చిదిమి, దాన్లో స్పూను తేనె, టేబుల్‌ స్పూను పాలు కలిపి, ప్యాక్‌ వేసుకోవాలి. 15 నిమిషాల తర్వాత చల్లని నీళ్లతో కడిగేసుకోవాలి. ఇలా చేస్తే వేసవి వేడికి కమిలిన చర్మం తాజాగా మారుతుంది. చెమ్చా తేనెలో టేబుల్‌ స్పూను కాఫీ పొడి కలిపి, మెత్తని పేస్ట్‌లా తయారు చేసుకోవాలి. దీన్ని ముఖం మీద అప్లై చేసి వేళ్లతో వృత్తాకారంలో మసాజ్‌ చేసి కడిగేసుకోవాలి. ఈ ప్యాక్‌తో ముఖ చర్మం వన్నె పెరుగుతుంది.