అల్సర్స్‌ - పేగుపూతలకు చెక్‌

ఆంధ్రజ్యోతి,09/09/15:అల్సర్స్‌ లేదా పేగుపూత ప్రస్తుత పరిస్థితుల్లో ఎక్కువ మందిలో ఉన్న సమస్య. ఇది ఎలా వస్తుందంటే జీర్ణయంత్రాంగం మార్గంలో ఎక్కడైనా జీర్ణరసాలలోని ఆమ్లగుణం తిని వేయడం వలన ఏర్పడే పుండును పేగుపూత అంటారు. 

పేగుపూత రకాలు 
పేగుపూతలు సామాన్యంగా అన్న సంచిలో డియోడినమ్‌, పెద్దప్రేగులో ఏర్పడతాయి. 
అన్నసంచిలో తయారు అయితే వాటిని గ్యాస్ట్రిక్‌  పేగుపూతలని అంటారు. 
పెప్టిక్‌ అల్సర్స్‌ 
అల్‌కోరేటివ్‌ కొలైటిస్‌ 
లక్షణాలు 
కడుపునొప్పి 
మలమార్గంలో మంట, నొప్పిగా ఉండటం
చాతిలో బరువుగా,మంటగా ఉండటం 
మలబద్ధకం గాని, లేదా చీటికి మాటికి విరేచనాలవడం. 
రక్తహీనత, బలహీనంగా అన్పించడం
కొన్ని సందర్భాల్లో బరువు తగ్గిపోవడం.  
అనర్థాలు 
పేగుపూతలో ఎక్కువగా కనపడే అనర్థాలు ఏవిటంటే తయారైన పుండు నుంచి కొంచెం కొంచెం రక్తస్రావం అవుతూ ఉండటం. ఇది కొంచెం ఎక్కువ అయినపుడు రక్తహీనతగా మారి రక్తహీనత లక్షణాలు ఎక్కువ కన్పించవచ్చు. 
పేగుపూత దీర్ఘకాలికమైనపుడు జీర్ణాశయం డయోడినిమ్‌లో లోతుగా గాటులు ఏర్పడి వాటి వల్ల జీర్ణాశయం నుంచి గ్రహిణిలోకి ప్రవేశించి ద్వారం ఇరుకు అవుతుంది. దీనినే పైలోరిక్‌ స్టెనోసిన్‌ అంటారు.ఈ పరిస్థితి వల్ల ఆహారం అడ్గుకుని వాంతులు అవుతూ, త్వరగా బలహీనంగా మారతారు. 
ఒక్కొసారి జీర్ణరసాలు  పేగుపూత ద్వారా తయారైన రంధ్రం నుంచి బయటకి వస్తే పేగు లైనింగ్‌ దెబ్బతింటుంది. దీనినే పెరిటోనిటీస్‌ అంటారు. ఈ దీర్ఘకాలిక  పేగుపూతలను అశ్రద్ధ చేస్తే వ్యాధి ముదిరి ఈ పుండు పగిలి పోతుంది. దీనినే పెర్‌ఫోరేషన్‌ అంటారు. 
కారణాలు 
ఆకలి లేకపోయిన తినడం 
జీర్ణం కాక మునుసే తినడం 
ఉపవాసాలు ఉండటం 
మద్యపానం, ధూమపానం వంటి అలవాట్లు 
పులుపు, ఉప్పు, కారం ఎక్కువగా తినడం 
మానసిక అలజడి, ఒత్తిడి 
నివారణ మార్గాలు 
మద్యపానం, ధూమపానం నిలిపివేయడం 
ఉపవాసాలు నిలిపివేయడం
భోజనం మితంగా చేయడం  
నొప్పి సంబంధిత మందులను ఎక్కువగా వాడకుండా ఉండటం 
పులుపు, పచ్చిమిర్చి, మసాల పదార్థాలు మితంగా తినడం 
వ్యాధి నిర్దారణ 
గ్యాస్ర్టో స్కోపి, కొలొనోస్కోపి
ఎండొస్కోపి 
బేరియంమీల్‌ ఎగ్జామ్‌ 
రక్తపరీక్షలు 
ఎక్స్‌ రే అన్నాశయం, డియోడినమ్‌ 
హోమియోపతి ఔషధాలు 
నక్స్‌లోమికా, లైడోపోడియం, ఆసిడ్‌ సల్ఫ్‌, ఆర్స్‌నికమ్‌ ఆల్బమ్‌, గ్రాఫైటిస్‌, కాలిబైక్రోమికమ్‌, కార్బోవెజ్‌, సల్ఫర్‌ మొదలైనవి.