కుంకుమపువ్వు ఖరీదే కానీ...

ఆంధ్రజ్యోతి, 17-07-2017: కుంకుమ పువ్వు ఎంతో ఖరీదైందే.... కానీ దానివల్ల ఆరోగ్యపరమైన లాభాలు ఎన్నో ఉన్నాయి. అవేమిటంటే...

కుంకుమపువ్వులో మాంగనీసు, ఐరన్‌, సెలేనియం, కాపర్‌, పొటాషియం, కాల్షియం, జింకు, మెగ్నీషియం వంటి ఖనిజాలు ఎన్నో ఉన్నాయి. వీటితోపాటు మరెన్నో బలవర్థకమైన విటమిన్లు కూడా ఉన్నాయి.

ఇది బ్రెయిన్‌లోని సెరటోనిన్‌ను ఆరోగ్యకర పరిమాణంలో ఉంచుతుంది.

ఒత్తిడి లక్షణాలను తగ్గిస్తుంది.

నిత్యం కుంకుమపువ్వును వాడేవాళ్లు కేన్సర్‌ బారిన పడరని స్టడీలో వెల్లడైంది.

కుంకుమపువ్వు వాడకం వల్ల శరీరంలో సెరొటోనిన్‌ ప్రమాణాలు పెరుగుతాయి.

సెరొటోనిన్‌కి ఆకలిని తగ్గించే గుణం ఉండడంతో ఊబకాయం తగ్గుతుంది.

కుంకుమపువ్వులో పొటాషియం ఉంది. అది రక్తపోటును తగ్గిస్తుంది. ఫలితంగా గుండెజబ్బులు తలెత్తవు.

డిప్రషన్‌తో బాధపడేవారికి కుంకుమపువ్వు మందులా పనిచేస్తుంది. డిప్రషన్‌ తలెత్తడానికి కారణం శరీరంలో తక్కువ పరిమాణంలో పొటాషియం ఉండడమే. కుంకుమపువ్వులో పొటాషియం పరిమాణం ఎక్కువ ఉంటుంది కాబట్టి డిప్రషన్‌ తగ్గుతుంది.

కుంకుమపువ్వు మంచిది కదా అని ఎక్కువ పాళ్లల్లో వాడితే అది విషంగా మారుతుంది.