లిప్‌స్టిక్‌ మ్యాచింగ్‌

ఆంధ్రజ్యోతి, 02-12-2016: చర్మపు రంగుకు మ్యాచ్‌ అయ్యే కలర్‌ వేస్తేనే లిప్‌స్టిక్‌ అందంగా, ఆకర్షణీయంగా ఉంటుంది. రంగు నచ్చింది కదా అని కనిపించిన లిప్‌స్టిక్స్‌ అన్నీ ట్రై చేయకుండా మీ స్కిన్‌ కలర్‌ని బట్టి లిప్‌స్టిక్‌ని ఎంచుకోండి. 

తెలుపు రంగు - తెల్లగా ఉండేవాళ్లు బబుల్‌గమ్‌ పింక్‌, కోరల్‌, పీచ్‌, రెడ్‌, ఆరెంజ్‌ లిప్‌స్టిక్‌లు ఎంచుకోవచ్చు. అయితే ఆ లిప్‌స్కిక్‌తో ఐ షాడో మ్యాచ్‌ అయ్యేలా చూసుకోవాలి. 
నలుపు రంగు - బర్గండీ, ఆక్స్‌బ్లడ్‌, కాఫీ కలర్‌ లిప్‌స్టిక్స్‌ సూటవుతాయి. ఈ రంగులతో ఐషాడ్‌ మ్యాచ్‌ అయ్యేలా చూసుకోవాలి. ఒకవేళ ఐ మేకప్‌ ఎక్కువగా ఉండాలనుకుంటే సాల్మన్‌ లేదా వాటర్‌ కలర్‌ పింక్‌ లిప్‌స్టిక్స్‌ ఎంచుకోవాలి. 
చామనఛాయ - ఫుషియా పింక్‌, బర్న్‌ట్‌ ఆరెంజ్‌ రంగులు బాగుంటాయి. ఐ మేకప్‌ లైట్‌గా వేసుకుంటే ఓకే! లేదంటే న్యూడ్‌ లిప్‌ హ్యూస్‌ నప్పుతాయి. 
గోధుమఛాయ - సాల్మన్‌ పింక్‌, హాట్‌ పింక్‌, రైప్‌ ఆరెంజ్‌లు సూటవుతాయి. లైట్‌ కలర్స్‌ కావాలనుకుంటే కోరల్‌, లైట్‌ పింక్‌లకు పరిమితమవాలి.