మెరుపు పెరుగుతుంది...

04-10-2018:పెరుగు ఆరోగ్యానికే కాదు చర్మ సౌందర్యానికి కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. ముఖం మీద చర్మం మృదువుగా, కాంతివంతంగా ఉండేలా చేస్తుంది. పెరుగుతో కొన్ని సులువైన బ్యూటీ టిప్స్‌ మీకోసం..
పెరుగులో కొద్దిగా నిమ్మరసం కలిపి ముఖానికి రాసుకుని 15 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడుక్కోవాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే చర్మం కాంతిమంతంగా తయారవుతుంది.
కొద్దిగా పెరుగు, గుడ్డు తెల్లసొన, ఉప్పు, చక్కెర కలుపుకుని మాస్కులా ముఖానికి రాసుకుని, అరగంట తర్వాత ముఖాన్ని నీళ్లతో కడిగేసుకుంటే ఎంతో ఉపశమనంగా ఉంటుంది.
పెరుగులో కొద్దిగా కాఫీపొడి, తేనె కలిపి ముఖానికి రాసుకుని ఇరవై నిమిషాల తర్వాత చల్లటి నీళ్లతో కడిగేసుకోవాలి. ఇలా చేస్తే చర్మంపై ఉన్న నల్లటి మచ్చలు, మొటిమలు పోతాయి.