ఆ రంగును వదిలించండి!

03-02-2018: పెదవుల చుట్టూ, పై పెదవి పై భాగాన ఉండే చర్మం మిగతా చర్మంతో పోలిస్తే నల్లగా ఉంటుంది కొందరిలో. ఈ సమస్య నుంచి బయటపడేందుకు ఇంట్లోనే పాటించే కొన్ని రెమెడీలు ఉన్నాయి.

పంచదార స్క్రబ్‌
ఒక నిమ్మ చెక్క, ఒక టీస్పూన్‌ పంచదార ఈ స్క్రబ్‌ తయారీకి కావాలి. నిమ్మ చెక్కను పలుచటి ముక్కలుగా తరిగి పంచదారలో వేయాలి. ఆ ముక్కలతో పెదవుల మీద సున్నితంగా మూడు నుంచి ఐదు నిమిషాలు రుద్దాలి. అవసరమనుకుంటే టూత్‌బ్ర్‌ష వాడొచ్చు. ప్రతిరోజూ ఇలా చేస్తే నలుపు రంగు విరిగిపోతుంది.
 
పసుపు మాస్క్‌
టొమాటో రసం ఒక టేబుల్‌ స్పూన్‌, నిమ్మరసం అర టేబుల్‌ స్పూన్‌, పసుపు అర టేబుల్‌ స్పూన్‌ తీసుకోవాలి. వీటన్నింటినీ ఒక గిన్నెలో వేసి పేస్ట్‌లా కలపాలి. ఈ మిశ్రమాన్ని రంగు మారిన చర్మం మీద రాయాలి. 20 నిమిషాల తరువాత చల్లటి నీళ్లతో కడిగేయాలి. ఇలా వారానికి రెండు మూడుసార్లు చేయాలి.