అండర్‌ ఆర్మ్‌ నలుపు పోవాలంటే...

28-02-2019:అండర్‌ ఆర్మ్‌ క్రీమ్స్‌ అందరికీ సరిపడకపోవచ్చు. కాబట్టి బాహుమూలాలు తెల్లగా మారడానికి ఇంట్లోనే అండర్‌ ఆర్మ్‌ ప్యాక్‌ తయారు చేసుకుని వాడి చూడండి.
బేకింగ్‌ సోడా, కొబ్బరినూనె సమపాళ్లలో కలుపుకొని, బాహుమూలాల్లో స్క్రబ్‌ చేయాలి.
10 నుంచి 15 నిమిషాల తర్వాత నీళ్లతో కడిగేయాలి.
బేకింగ్‌ సోడా వల్ల ఆ ప్రదేశంలోని చర్మం ఎక్స్‌ఫోలియేట్‌ అవుతుంది.
ఇలా క్రమం తప్పకుండా రెండు రోజులకొకసారి చేస్తే, బాహుమూలాలు మామూలు రంగులోకి మారుతాయి.